Vaarahi Worship Procedure

Who is VAARAAHI ?

Vaarahi Worship sloka:- She is one of the Matrikas, a group of seven mother goddesses in the Hindu religion. Bearing the head of a sow, Varahi is the shakti (feminine energy) of Varaha, the boar avatar of the god Vishnu. In Nepal, she is called Barahi. In Rajasthan and Gujarat, she is venerated as Dandini.

Firstly, Varaahi is more commonly venerated in the sect of the Goddess-oriented Shaktism. But also in Shaivism (devotees of Shiva) and Vaishnavism (devotees of Vishnu). However, She is usually worshipped at night, using secretive Vamamarga Tantric practices. The Buddhist goddesses Vajravārāhī and Marichi have their origins in the Hindu goddess Vaaraahi.

Vaaraahi Amma Vaarahi Worship sloka

సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం

పూజకు కావాల్సిన సామగ్రి

1.పసుపు

2.కుంకుమ

3.ఆగర్భత్తులు

4.దానిమ్మ పండు గింజలు

5.లడ్డులు(5)

6.అమ్మ వారి చిత్రపటం.

విగ్రహం, కలశం, ఇవేవీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి, అ దీపకాంతిని వారాహిమాత  గా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు.

7. (పువ్వులు) ఖచ్చితంగా పలనా పువ్వులు పెట్టాలని రూల్ ఏమీ లేదు ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు, అలాగే అమ్మవారినీ, భూదేవి అని అంటారు, కనుక ఈ భూమిమీద ఏ పువ్వు అయిన రోడ్డు పక్కన మన పెరటిలో వికసించిన ఏ పుష్పం అయిన అమ్మకు ఇష్టం, పూలకోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

దానిమ్మ గింజాలు ఒక గుప్పెడు, లడ్డులు 5 గుండ్రంగా ఉండాలి

ప్రతినిత్యం మీరు ఈ నామాలను స్మరిచండి….

ఓం పంచమే నమః

ఓం దండనాథ నమః

ఓం సంకేత నమః

ఓం సమయేశ్వరి నమః

ఓం సమయ సంకేత నమః

ఓం పోత్రిన్యే నమః

ఓం శివయే నమః

ఓం ఆజ్ఞ చక్రేశ్వరి నమః

ఓం మహా సైన్యయే నమః

ఓం వార్తాలీ నమః

ఈ నామాలతో స్మరిస్తే సకల కార్య సిద్ధి లభిస్తుంది.

॥ వారాహీ గాయత్రీ ॥

వరాహముఖ్యై విద్మహే । దణ్డనాథాయై ధీమహీ ।

తన్నో అర్ఘ్రి ప్రచోదయాత్

 

(వారాహి మాత ధ్యాన స్తోత్రం)

వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషామ్

హారాగ్రైవేయతుంగస్తనభరనమితాం పీతకైశేయవస్త్రామ్ ।

దేవీం దక్షోధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలమ్

వామాభ్యాం ధారయన్తీం కువలయకలితాం శ్యామలాం సుప్రసన్నామ్ ||

ఈ మంత్రాన్ని జపం చేయడం మోదలు పెట్టాలి మీ శక్తి వంచన లేకుండా రోజూ 108 లేదా 5 సార్లు ఈ మంత్రాన్ని జపించి గుండ్రంగా ఉండే ఆహారం ముఖ్యంగా దానిమ్మపండు ,లడ్డు లాంటివి నివేదన చేసి 5 వారాలు జపం చేయాలి. మీ సంకల్పం నెరవేరుతుంది. అదే ఈ మంత్రం..

 

సర్వ బాధ నివారిణి అయిన బృహద్వారాహి మహా మంత్రం

‘అస్యశ్రీ బృహద్వారాహి మహామంత్రస్య బ్రహ్మ ఋషి , గాయత్రీచ్ఛందః శ్రీబృహద్వారాహి దేవతా | గ్లేo  బీజం | ఐం శక్తిః  ఠ : కీలకం!

ఐం, గ్లౌం, ఐం, నమో భగవతే వార్తాళీ 2 – వారాహి 2 || వరాహముఖి 2 || అంధే అంధినేనమః 11 రుంధే రుంధినేనమః 111 ఓం జృంభినీ నమః న్యాసః  

( 2 ఉన్న చోట ఇంకో 2 సార్లు, 11 ఉన్న చోట అదే పదం 11 సార్లు, 111 సార్లు అన్న పదాన్ని 111 సార్లు పలకాలి)

ధ్యానం |

రక్తాంబుజే ప్రేతవరాసనస్థా మర్ణోరు కామార్ఫటికా సనస్థాం |

ద్రం షోల్ల సత్ప్రోత్రిముఖారవిందాం |

కోటి రసంఛిన్న హిమాంశురేఖాం |

హలం కపాలం ధధతీక రాభ్యాం , వామే కరాభ్యాం ముసలేష్ఠదేచ |

రక్తాంబరాం రక్త పటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం |

చ్యామాం సమస్తా భరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యం ||

మనుః 

 (ఇక్కడ నుండి మూల మంత్రం ఇది 108 సార్లు చేయాలి)

ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతీ వార్తాళీ, వారాహి, వరాహముఖి,

ఐం గ్లౌం ఐం అందె అంధినీ నమః | రుంధే రుంధినీ నమః | జంభే జంభినీనమః | మోహే మోహినే నమః | స్తంభే స్తంభినీ నమః |
ఐం గ్లౌం ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వ స్తంభనం కురు, శీఘ్రం వశ్యం కురు

ఐం గ్లౌం ఐం ఠ : ఠ : ఠ : ఠ :  హుం ఫట్ స్వాహా||

నమో వారాహి: !

Vaaraahi Devi in Lotus with Green Saree

Vaarahi Worship sloka

Vaarahi Worship sloka in telugu
Vaaraahi worship sloka

Varaahi Amman Yantra in copper

శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి

ఐం గ్లౌం నమో వరాహవదనాయై నమః |
ఐం గ్లౌం నమో వారాహ్యై నమః ।
ఐం గ్లౌం వరరూపిణ్యై నమః ।
ఐం గ్లౌం క్రోడాననాయై నమః ।
ఐం గ్లౌం కోలముఖ్యై నమః ।
ఐం గ్లౌం జగదమ్బాయై నమః ।
ఐం గ్లౌం తరుణ్యై నమః ।
ఐం గ్లౌం విశ్వేశ్వర్యై నమః ।
ఐం గ్లౌం శఙ్ఖిన్యై నమః ।
ఐం గ్లౌం చక్రిణ్యై నమః ॥ 10 ॥
ఐం గ్లౌం ఖడ్గశూలగదాహస్తాయై నమః ।
ఐం గ్లౌం ముసలధారిణ్యై నమః ।
ఐం గ్లౌం హలసకాది సమాయుక్తాయై నమః ।
ఐం గ్లౌం భక్తానామభయప్రదాయై నమః ।
ఐం గ్లౌం ఇష్టార్థదాయిన్యై నమః ।
ఐం గ్లౌం ఘోరాయై నమః ।
ఐం గ్లౌం మహాఘోరాయై నమః ।
ఐం గ్లౌం మహామాయాయై నమః ।
ఐం గ్లౌం వార్తాల్యై నమః ।
ఐం గ్లౌం జగదీశ్వర్యై నమః ॥ 20 ॥
ఐం గ్లౌం అణ్డే అణ్డిన్యై నమః ।
ఐం గ్లౌం రుణ్డే రుణ్డిన్యై నమః ।
ఐం గ్లౌం జమ్భే జమ్భిన్యై నమః ।
ఐం గ్లౌం మోహే మోహిన్యై నమః ।
ఐం గ్లౌం స్తమ్భే స్తమ్భిన్యై నమః ।
ఐం గ్లౌం దేవేశ్యై నమః ।
ఐం గ్లౌం శత్రునాశిన్యై నమః ।
ఐం గ్లౌం అష్టభుజాయై నమః ।
ఐం గ్లౌం చతుర్హస్తాయై నమః ।
ఐం గ్లౌం ఉన్నతభైరవాఙ్గస్థాయై నమః ॥ 30 ॥
ఐం గ్లౌం కపిలాలోచనాయై నమః ।
ఐం గ్లౌం పఞ్చమ్యై నమః ।
ఐం గ్లౌం లోకేశ్యై నమః ।
ఐం గ్లౌం నీలమణిప్రభాయై నమః ।
ఐం గ్లౌం అఞ్జనాద్రిప్రతీకాశాయై నమః ।
ఐం గ్లౌం సింహారుద్రాయై నమః ।
ఐం గ్లౌం త్రిలోచనాయై నమః ।
ఐం గ్లౌం శ్యామలాయై నమః ।
ఐం గ్లౌం పరమాయై నమః ।
ఐం గ్లౌం ఈశాన్యై నమః ॥ 40 ॥
ఐం గ్లౌం నీల్యై నమః ।
ఐం గ్లౌం ఇన్దీవరసన్నిభాయై నమః ।
ఐం గ్లౌం కణస్థానసమోపేతాయై నమః ।
ఐం గ్లౌం కపిలాయై నమః ।
ఐం గ్లౌం కలాత్మికాయై నమః ।
ఐం గ్లౌం అమ్బికాయై నమః ।
ఐం గ్లౌం జగద్ధారిణ్యై నమః ।
ఐం గ్లౌం భక్తోపద్రవనాశిన్యై నమః ।
ఐం గ్లౌం సగుణాయై నమః ।
ఐం గ్లౌం నిష్కలాయై నమః ॥ 50 ॥
ఐం గ్లౌం విద్యాయై నమః ।
ఐం గ్లౌం నిత్యాయై నమః ।
ఐం గ్లౌం విశ్వవశఙ్కర్యై నమః ।
ఐం గ్లౌం మహారూపాయై నమః ।
ఐం గ్లౌం మహేశ్వర్యై నమః ।
ఐం గ్లౌం మహేన్ద్రితాయై నమః ।
ఐం గ్లౌం విశ్వవ్యాపిన్యై నమః ।
ఐం గ్లౌం దేవ్యై నమః ।
ఐం గ్లౌం పశూనామభయకారిణ్యై నమః ।
ఐం గ్లౌం కాలికాయై నమః ॥ 60 ॥
ఐం గ్లౌం భయదాయై నమః ।
ఐం గ్లౌం బలిమాంసమహాప్రియాయై నమః ।
ఐం గ్లౌం జయభైరవ్యై నమః ।
ఐం గ్లౌం కృష్ణాఙ్గాయై నమః ।
ఐం గ్లౌం పరమేశ్వరవల్లభాయై నమః ।
ఐం గ్లౌం సుదాయై నమః ।
ఐం గ్లౌం స్తుత్యై నమః ।
ఐం గ్లౌం సురేశాన్యై నమః ।
ఐం గ్లౌం బ్రహ్మాదివరదాయై నమః ।
ఐం గ్లౌం స్వరూపిణ్యై నమః ॥ 70 ॥
ఐం గ్లౌం సురానామభయప్రదాయై నమః ।
ఐం గ్లౌం వరాహదేహసమ్భూతాయై నమః ।
ఐం గ్లౌం శ్రోణివారాలసే నమః ।
ఐం గ్లౌం క్రోధిన్యై నమః ।
ఐం గ్లౌం నీలాస్యాయై నమః ।
ఐం గ్లౌం శుభదాయై నమః ।
ఐం గ్లౌం శుభవారిణ్యై నమః ।
ఐం గ్లౌం శత్రూణాం వాక్స్తమ్భనకారిణ్యై నమః ।
ఐం గ్లౌం శత్రూణాం కటిస్తమ్భనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం శత్రూణాం మతిస్తమ్భనకారిణ్యై నమః ॥ 80 ॥

ఐం గ్లౌం శత్రూణాం సాక్షీస్తమ్భనకారిణ్యై నమః ।

ఐం గ్లౌం శత్రూణాం మూకస్తమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం శత్రూణాం జిహ్వాస్తమ్భిన్యై నమః ।

ఐం గ్లౌం దుష్టానాం నిగ్రహకారిణ్యై నమః ।
ఐం గ్లౌం శిష్టానుగ్రహకారిణ్యై నమః ।
ఐం గ్లౌం సర్వశత్రుక్షయకరాయై నమః ।
ఐం గ్లౌం శత్రుసాదనకారిణ్యై నమః ।
ఐం గ్లౌం శత్రువిద్వేషణకారిణ్యై నమః ।
ఐం గ్లౌం భైరవీప్రియాయై నమః ।
ఐం గ్లౌం మన్త్రాత్మికాయై నమః ॥ 90 ॥
ఐం గ్లౌం యన్త్రరూపాయై నమః ।
ఐం గ్లౌం తన్త్రరూపిణ్యై నమః ।
ఐం గ్లౌం పీఠాత్మికాయై నమః ।
ఐం గ్లౌం దేవదేవ్యై నమః ।
ఐం గ్లౌం శ్రేయస్కారిణ్యై నమః ।
ఐం గ్లౌం చిన్తితార్థప్రదాయిన్యై నమః ।
ఐం గ్లౌం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః ।
ఐం గ్లౌం సమ్పత్ప్రదాయై నమః ।
ఐం గ్లౌం సౌఖ్యకారిణ్యై నమః ।
ఐం గ్లౌం బాహువారాహ్యై నమః ॥ 100॥
ఐం గ్లౌం స్వప్నవారాహ్యై నమః ।
ఐం గ్లౌం భగవత్యై నమో నమః ।
ఐం గ్లౌం ఈశ్వర్యై నమః ।
ఐం గ్లౌం సర్వారాధ్యాయై నమః ।
ఐం గ్లౌం సర్వమయాయై నమః ।
ఐం గ్లౌం సర్వలోకాత్మికాయై నమః ।
ఐం గ్లౌం మహిషనాశినాయై నమః ।
ఐం గ్లౌం బృహద్వారాహ్యై నమః ॥ 108 ॥

ఇతి శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ వారాహీ దేవి కవచం

అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః

అనుష్టుప్ ఛందః

శ్రీ వారాహీ దేవతా
ఓం బీజం, గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం.

మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
ధ్యానమ్

ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం I
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ II 1

జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం I
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ II 2

ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం I
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ II 3

పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం I
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ II 4

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ I
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంభినీII 5

పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్ I
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా II 6

సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా I
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి II 7

ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ I

గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా II 8

చండోచ్చండ శ్చోరుయుగ్మం జానునీ శత్రుమర్దినీ I
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో II 9

పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ I
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. II 10

యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే I
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్. II 11

సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే I
సర్వశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. II 12

సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః I
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. II 13

తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన I
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః. II 14

మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం I
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా II 15

ఇతి శ్రీ రుద్రయామలతంత్రే,

శ్రీ వారాహీ కవచం సంపూర్ణం ||

👉 వారాహి పూజ రాత్రి సమయంలో నే చేయాలి. అంటే చీకటి పడ్డాక 8 గం తర్వాత రాత్రి సమయంలో మొదలు పెట్టాలి.

👉పగటిపూట వారాహి ఉపాసన చేయరాదు…

🌷శ్రీ మాత్రే నమః🌷

Sri Vaarahi Kavacha Stotram

Vaarahi Worship sloka

In general, Vaaraahi is Worshiped in the night. However you can do normal slokas in day time. In other words, you can do varahi worship at any time of the day.

Vaarahi Navarathrulu in 2024 is from 06/07/2024 to 14/07/2024.

RSS
Follow by Email
YouTube
YouTube
Scroll to Top